కేసీఆర్ సభ కాంగ్రెస్ పతనానికి నాంది కావాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:13 AM
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఈ నెల27నజరిగే కేసీఆర్‌సభ కాంగ్రె స్ పతనానికి నాంది కావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.
హుజూరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఈ నెల27నజరిగే కేసీఆర్‌సభ కాంగ్రె స్ పతనానికి నాంది కావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో బీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ హుజూరా బాద్ నియోజకవర్గం నుంచి సుమారు లక్షమందిని తరలిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ధాన్యం దళారులకు అమ్మి నష్టపోవద్దు..
జమ్మికుంట: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణం లోని పాత వ్యవసాయ మార్కెట్‌లో సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులు రైతులను మోసం చేయా లని చూస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న, వైస్‌చైర్మన్ సతీష్‌రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మామిడి తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రమేష్, పాల్గొన్నారు.