Share News

మహనీయుల జయంత్యుత్సవ కరపత్రం ఆవిష్కరణ

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:32 AM

మహనీయుల జయంతోత్సవ కరపత్రాన్ని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.

మహనీయుల జయంత్యుత్సవ కరపత్రం ఆవిష్కరణ

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): మహనీయుల జయంతోత్సవ కరపత్రాన్ని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. మానకొండూర్‌ నియోజకవర్గ కార్యాలయం లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు సావనపె ల్లి రాకేష్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. మహనీయులు చూపిన మార్గంలో నడువాలని సూచించా రు. మండలకేంద్రంలో ఈనెల 30న జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జయంతోత్సవ కమిటీ కన్వీనర్‌ సావనపెల్లి రాకేష్‌, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నాయకులు మామిడి సంజీవ్‌, కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పసుల వెంకటి, కాసుపాక శంకర్‌, ముత్యం అమర్‌, ఎలుక స్వామి, రామస్వామి, మంద రాజు, శంకర్‌, ఉస్మాన్‌, మామిడి రాజు, విజయ్‌, మచ్చ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:32 AM