Share News

సమన్వయంతో పని చేయాలి..

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:36 AM

న్యాయవాదులు, న్యాయాధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు.

సమన్వయంతో పని చేయాలి..

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): న్యాయవాదులు, న్యాయాధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మేడ్చల్‌-మల్కాజ్‌గిరి నుంచి సిరిసిల్లకు బదిలీపై వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదులు ఘనస్వాగ తం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో గౌరవం పెంచే లా సమష్టిగా పనిచేద్దామన్నారు. జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి సహా యసహకారాలు అందిస్తానన్నారు. సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జూ పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బార్‌ అండ్‌ బెంచ్‌లు సమన్వయంగా పనిచే సేందుకు తాము కృషిచేస్తామన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో జిల్లా ప్రధానన్యాయమూర్తి పి. నీరజ, 1వ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా జడ్జి పుష్పలతలను ఘనంగా సత్కరించారు. సీనియర్‌సివిల్‌ జడ్జి లక్ష్మణాచారి, 1వ అడిషనల్‌ జూని యర్‌ సివిల్‌ జడ్జి సృజన, సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంక టి, ఉపాధ్యక్షులు సజ్జనం అనిల్‌కుమార్‌, మహిళా ప్రతినిధి పుష్పలత, లైబ్రరీ కార్యదర్శి శరత్‌రెడ్డి, క్యాషియర్‌ వేముల నరేశ్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయవా దులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:36 AM