Share News

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:43 PM

మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌, అగ్రికల్చర్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పత్తం యాదగిరి మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉపాధి పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. తమ సేవలను ప్రభుత్వాలు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల మెనిఫేస్టోలో ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పేస్కేలు వర్తింపచేస్తూ, వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నజీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 21 , 2025 | 11:43 PM