మాతా శిశు మరణాలు జరగకుండా జాగ్రత్తలు
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:04 AM
మాతా శిశు మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసు కోవడంతో పాటు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వైద్య ఆరోగ్య శాఖ అధికా రులను అదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : మాతా శిశు మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసు కోవడంతో పాటు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వైద్య ఆరోగ్య శాఖ అధికా రులను అదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో బుధవారం మాతా శిశుమరణాలు, టీబీ కేసులు, కుష్టు తదితర అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో గత నెలలో ప్రసవాలు ఎన్ని చేశారో అడిగి తెలుసుకు న్నారు. నెలలో మొత్తం 666 ప్రసవాలను చేశామని జిల్లా వైధ్యాధికారి డాక్టర్ రజిత కలెక్టర్‌కు వివరించారు. గర్భీణీలు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని కలెక్టర్ సృష్టం చేశారు. ప్రోగ్రామ్ అధికారులు, డాక్టర్‌లు, ఆశా కార్యకర్తలు నిత్యం గర్భిణు లతో మాట్లాడాలని వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇతర వివరాలు అందుబాటులో ఉండాలన్నారు. ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పు డు సమాచారం తెలుసుకునేందుకు ఫోన్‌లు చేయాలన్నారు. ప్రభు త్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరిగేలా వైద్యులు శ్రద్ధ పెట్టాలని గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని ఆయా ఆసుపత్రుల్లో గైనకాలజిస్టులు అవసరం ఉంటే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ఆసుపత్రులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. భ్రూణహత్యలు ఎక్కడ జరుగకుండా ఉండాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో పనివేళ్లల్లో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి ఉత్తమ సేవలను అందించాలని సూచించారు. జిల్లాలో టీబీ కేసులను గుర్తించేందుకు పరీక్షలు నిరంతరం చేయాలని పాజిటివ్ వచ్చిన వారికి తగిన మందులను అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించాలన్నారు. ఆర్‌బీఎస్‌లో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్ష లు ఎక్కడివరకు చేశారని అడిగితెలుసుకున్నారు. లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ అసుపత్రిలో ఉత్తమ సేవ లందిస్తూ నిత్యం నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాధి కారి డాక్టర్ రజిత, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీనారా యణ, వేములవాడ ఏరియా అసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.