Share News

వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:30 AM

వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టడంతోపాటు పెండింగ్‌ బిల్లులు, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టడంతోపాటు పెండింగ్‌ బిల్లులు, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలో టీపీటీఎఫ్‌ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జిల్లా అధ్యక్షుడు దుమాల రామనాఽథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో పలు రకాల పాఠ శాలలను నెలకొల్పి అంతరాలు కలిగిన విద్యావిధానాన్ని అమలు చేయడం ద్వారానే విద్యారంగంలో అసమానతలు ఏర్పడ్డాయన్నారు. వివిధ యాజమాన్యాల కింద కొనసాగుతున్న పాఠశాలలను రద్దు చేసి ప్రైవేటు పాఠశాలల వ్యవస్థను రద్దుచేసి విద్యార్థులందరికి నాణ్యమైన, శాస్త్రీయమైన సమానమైన విద్యను అందించాలంటే కామాన్‌ స్కూల్‌ విధానాన్ని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం 56 పాఠశాలలకే వేలకోట్లు నిధులు కేటాయించి వేలాది రూపా యల అభివృద్ధికి అరకొర నిఽధులు కేటాయించడం సరైందికాదన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవుల ల్లోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టడంతో పాటు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీని యర్‌ నాయకులు కొలుగూరి కిషన్‌రావు, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్య దర్శి విక్కుర్తి అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పురం వాసుదేవరావు, దబ్బెడ హనుమాండ్లు, మందాడి శ్రీనివాస్‌రెడ్డి, నూగురి దేవేందర్‌, జిల్లా కార్యరద్శి పార్వతి తిరుపతి, తాళ్లపల్లి శ్రీధర్‌, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, ఎడ్ల కృష్ణ, చైతన్య, బుస రాజేందర్‌, చకినాల భాస్కర్‌, సిద్దంశెట్టి శ్రీనివాస్‌, రమేష్‌రెడ్డి, రాంప్రసాద్‌, శ్రీనివాస్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:30 AM