రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులందరికి అందించాలి..
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:48 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హు లైన వారందరికి అందించాలని కలెక్టర్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క ఆదేశించారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 31 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హు లైన వారందరికి అందించాలని కలెక్టర్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో అర్హులందరికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. అన్నిమండల పరిషత్ కార్యాల యాలు, మున్సిపల్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను అందు బాటులో ఉంచడంతో పాటు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనే జర్ మల్లికార్జున్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.