Share News

పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలి

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:39 PM

నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచాలని అధికారులు, సిబ్బందిని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. నగరంలోని 5, 26, 27 డివిజన్లలో ఆమె శుక్రవారం పర్యటించారు. పారిశుధ్య పనులను తనిఖీ చేశారు.

పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలి
కాలనీ వాసులతో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమీషనర్‌ చాహాత్‌ బాజ్‌పాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచాలని అధికారులు, సిబ్బందిని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. నగరంలోని 5, 26, 27 డివిజన్లలో ఆమె శుక్రవారం పర్యటించారు. పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. పారిశుద్య కార్మికుల బయోమెట్రిక్‌, హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి జవాన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్లలో జరుగుతున్న పారిశుధ్య పనులపై ఆరా తీశారు. నగర పాలక సంస్థ ద్వారా నిర్వహించే అన్నపూర్ణ 5 రూపాయల భోజనం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరపాలక సంస్థకు మంచి ర్యాంకు వచ్చేలా కార్మికులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. నగరాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటూ సెగ్రిగేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తడి చెత్తను వర్మి కంపోస్టు కేంద్రాలకు, పొడి చెత్త డబ్బాలు, అట్ట ముక్కలను డీఆర్‌సీసీకి తరలించేలా చూడాలన్నారు. కాలనీల్లో ఓపెన్‌ డ్రైనేజీల్లో సిల్ట్‌ తొలగించి డ్రైనేజీ పరిసర ప్రాంతాలను, చెత్త కలెక్షన్‌ పాయింట్లను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున కార్మికులు సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమీషనర్‌ వేణుమాదవ్‌, జవాన్లు నరేందర్‌, సాయి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:39 PM