Share News

ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్‌ వర్ధంతి

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:49 AM

జిల్లాలో సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్‌ వర్ధంతి

సిరిసిల్ల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో సర్వా యి పాపన్న చిత్రపటానికి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న చేసిన సేవలను గుర్తు చేశారు. జడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాఽజామనోహర్‌రావు, ఎల్‌డీఎం మళ్లిఖార్జున్‌, గౌడ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి గౌడ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు బోల్గం నాగరాజు గౌడ్‌, పులి లక్ష్మీపతిగౌడ్‌, బండి దేవదాస్‌, నేరేళ్ల శ్రీకాంత్‌గౌడ్‌, బుర్ర నారా యణగౌడ్‌, నర్సాగౌడ్‌, అంజయ్య, అనిల్‌, బండారి శ్రీనివాస్‌, కార్తీక్‌, పర్శ య్యగౌడ్‌, తిరుపతిగౌడ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:49 AM