siricilla : స్వయంఉపాధిపై ఆశలు..
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:31 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) నిరుద్యోగ యువతీ, యువకులు స్వయంఉపాధిపై ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించే దిశగా దరఖాస్తులను స్వీకరించింది.
- రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన
- జిల్లాలో 23,477 దరఖాస్తులు
- యూనిట్ల కేటాయింపునకు కసరత్తు
- కలెక్టర్ నేతృత్వంలో ఎంపిక కమిటీలు
- ఈనెల 29వరకు దరఖాస్తుల పరిశీలన
- జూన్ 2న లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
నిరుద్యోగ యువతీ, యువకులు స్వయంఉపాధిపై ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించే దిశగా దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మార్చి 17 నుంచి ఏప్రిల్ 14వరకు జిల్లాలో పోటీపడి దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోగా మరికొందరు మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు.
ఫజిల్లాలో 23,477 దరఖాస్తులు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి 23,477 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌కు 5,946, ఎస్టీ కార్పొరేషన్‌కు 1,264, బీసీ కార్పొరేషన్‌కు 14,807, మైనార్టీ కార్పొరేషన్‌కు 815, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 13 దరఖాస్తులు, ఈబీసీ దరఖాస్తులు 632 వచ్చాయి. దరఖాస్తులను మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో పరిశీలిస్తున్నారు.
ఫ 29 వరకు తేలనున్న అర్హులు..
జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ఎంపిక కమిటీలు ఈనెల 29 వరకు రాజీవ్ యువ వికాసంలో దరఖాస్తుదారుల్లో అర్హులు ఎవరో తేల్చనున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి జూన్ 2న లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఎంపిక కమిటీలో ఆయా శాఖల అధికారులు పనిచేస్తారు. ప్రభుత్వం జానాభా ప్రతిపాదికన కులాల వారీగా రాజీవ్ యువ వికాసానికి యూనిట్‌లను ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనిట్‌లు ఎవరికి అందుతాయనే ఆసక్తి కూడా నెలకొంది. పథకంలో రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల రుణాలు అందిస్తుండగా రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీ రాయితీ, రూ.50 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ రాయితీ కాగా, పది శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, 20 శాతం రుణం, రూ.2 నుంచి 4లక్షల వరకు 70 శాతం సబ్సిడీ 30 శాతం రుణంగా అందించనున్నారు. ప్రభుత్వం అందించే యూనిట్లలో పౌల్ర్టీ, బ్యాగుల తయారీ, కొబ్బరిబొండాల దుకాణాలు, బ్యాంగిల్‌స్టోర్, డెయిరీ ఫాం, ఎలక్ర్టికల్, మినీ సూపర్ బజార్, స్ర్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, గొర్రెలు, సెలూన్, బ్యూటీపార్లర్, హార్డ్‌వేర్, మెడికల్ దుకాణాలు ఇలా పలు యూనిట్లను నిర్ణయించారు.
ఫ పైరవీలపైనే ఆసక్తి..
యువ వికాసం పథకంలో రాయితీ ఎక్కువగా ఉండడంతో యువతీ, యువకులు పైరవీలపై ఆసక్తి చూపుతున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ నాయకుల పలుకుబడి చెల్లుబాటు అవుతుందని నేతల ఇళ్ల వద్ద సందడిగా కనిపిస్తోంది. ఎంపిక జాబితాలో చోటు దక్కే విధంగా చూడాలంటూ చక్కర్లు కొడుతున్నారు. సబ్సిడీలో కొంత పైరవీ నేతలకు అందించడానికి బేరసారాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
జిల్లాలో వచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులు
మండలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ క్రిస్టియన్ మొత్తం
బోయినపల్లి 243 05 515 05 07 00 775
చందుర్తి 269 18 658 34 11 00 990
ఇల్లంతకుంట 627 21 1327 49 37 00 2061
గంభీరావుపేట 386 151 918 22 123 00 1600
కోనరావుపేట 403 75 700 14 15 03 1210
ముస్తాబాద్ 2045 355 4092 226 237 00 6955
రుద్రంగి 80 80 160 07 07 00 334
తంగళ్లపల్లి 172 35 2049 21 121 01 2999
వీర్నపల్లి 413 10 1198 48 06 00 1675
వేములవాడ రూరల్ 121 223 261 09 08 00 622
వేములవాడ అర్బన్ 191 13 333 04 10 00 551
ఎల్లారెడ్డిపేట 167 14 308 08 12 00 509
సిరిసిల్ల మున్సిపల్ 331 66 1003 77 118 04 1599
వేములవాడ మున్సిపల్ 498 198 1287 108 103 05 2197
-----------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 5946 1264 14807 632 815 13 23477
-----------------------------------------------------------------------------------------------------------------------------------