Share News

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:48 AM

పేద వారి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

చందుర్తి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): పేద వారి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా లోనే మొట్టమొదటిసారిగా చందుర్తి మండ లం నర్సింగాపూర్‌ గ్రామంలో రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజ లకు పంపిణీ చేస్తున్న ఉచిత సన్నబియ్యం పథకాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రం లో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. గతంలో దొడ్డు బియ్యం మెత్తగా ఉంటుందని మధ్య దళారులకు అమ్మివారు దానిని రీసైక్లింగ్‌ చేసి మళ్లీ మనకు అమ్మే పరిస్థితి ఉండేది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పరిస్థి తులన్నీ చూసి పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డుపై దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో ఆరు కిలోల సన్నంబియ్యం అని పంపిణీ చేసస్తున్నార న్నారు. దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రారంభిం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి ఇంటికి కరెంటును అందిస్తోందని తెలిపారు. గతంలో రోడ్డు ఎక్కితే గాని రైతన్నకి నీటిని విడుదల చేసే పరిస్థితి ఉందని కానీ ప్రజా ప్రభుత్వంలో రైతు అడగకముందే నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అంద జేస్తామన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ 500కి సిలిండర్‌, వేములవాడ నియో జకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నానన్నారు. వేములవాడలో ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ఇంచుమించు ఎనిమిది మంది మంత్రుల చేతు ల మీదుగా 1000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బీసీ కులగణన చేసి బీసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చడం జరిగిందని అలాగే 30సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందన్నారు. ఈ రెండు చారిత్రాత్మక బిల్లులో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. రాజకీయం గా జన్మనిచ్చిన చందుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌, డీసీఎస్‌వో వసంతలక్ష్మీ, డీఎంహెచ్‌వో రజిత, తహాసీ ల్దార్‌ శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ చెల్కల తిరుపతి, వైస్‌ చైర్మన్‌ బోజ్జ మల్లేశం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్‌, నాయకులు చింతపంటి రామస్వామి, భీమారాజు కనక రాజు, ఇల్లంతకుంట గణేష్‌, గొట్టె ప్రభాకర్‌, పులి సత్తయ్య, దూది శ్రీనివాసరెడ్డి, సొంత పూరి బాలు, ఏసుదాను రేషన్‌ డీలర్లు, మాజీ ప్రజాప్రతినిఽధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:48 AM