Share News

న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చిన ఉమాశంకర్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:46 AM

న్యాయ వాద వృత్తికే ఉమాశంకర్‌ వన్నె తెచ్చారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. ప్రేమలత అన్నారు.

న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చిన ఉమాశంకర్‌

సిరిసిల్ల క్రైం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): న్యాయ వాద వృత్తికే ఉమాశంకర్‌ వన్నె తెచ్చారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. ప్రేమలత అన్నారు. 60 ఏళ్ల న్యాయవాద వృత్తి పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్‌ ఫం క్షన్‌ హాల్‌లో ఉమాశంకర్‌ను న్యాయమూర్తులు, న్యా యవాదులు ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథి గా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. ప్రేమలత మాట్లాడుతూ ఎంతో న్యాయవాది వృత్తి లోనే 60 సంవత్సరాలు పూర్తిచేయడం అభినందనీ యమన్నారు. ప్రతి న్యాయవాదికి ఆదర్శంగా నిలు స్తారన్నారు. అనంతరం సన్మానగ్రహీత ఉమాశంకర్‌ మాట్లాడుతూ సంతోషమే ఆరోగ్యానికి తొలిమెట్టని అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీ ణ్‌, 2వ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గడ్డం మే ఘన, కవి జూకంటి జగన్నాథం, బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షులు శ్రీనివాస్‌రావు, గుడిసె సదానం దం, కార్యదర్శులు వెంకటి, రజ నికాంత్‌, మాజీ ఏజీపీ రవీందర్‌రావు, కుమారులు శివప్ర సాద్‌, హరిప్రసాద్‌, గుడ్ల రవి, సీనియ ర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత జూకంటి జగన్నాథం రాసిన మానది అనే పుస్తకాన్ని జిల్లా జడ్జి ప్రేమలత ఆవిష్కరించారు. పుస్తకాన్ని ఉమాశంకర్‌కు అంకితం చేస్తున్నట్లు రచ యిత జూకంటి జగన్నాథం ప్రకటించారు.

Updated Date - Mar 30 , 2025 | 12:46 AM