Share News

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:32 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.

    స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
ఓగులాపూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న చాడ వెంకటరెడ్డి

చిగురుమామిడి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని రేకొండ, ఓగులాపూర్‌, రామంచ, మూదిమాణిక్యం, సుందరగిరి, ముల్కనూర్‌ గ్రామాల్లో మహాసభలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల, కర్షకుల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి సత్తా చాటాలన్నారు. ఆయా గ్రామాల్లో సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నాగెళ్లి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:32 PM