Share News

పరిహారం ఇచ్చేదెప్పుడు?

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:13 AM

కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైను గంగాధర మండలం కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి, కాసారం,ఉప్పరమల్యాల గ్రామాల మీదుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఆ గ్రామాల్లోని భూముల్లో సర్వేలు నిర్వహించి హద్దులు పాతారు. అంతే మళ్లీ అటువైపు రాలేదు. ఆ గ్రామాలకు చెందిన రైతులు ఏదైనా అవసరం ఉండి భూములు అమ్ముకుందామన్నా వీలు లేకుండా పోయింది. ఏళ్లు గడిచినా పరిహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

పరిహారం ఇచ్చేదెప్పుడు?
రైల్వే లైనులో కోల్పోతున ్న గృహాలు

కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైను గంగాధర మండలం కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి, కాసారం,ఉప్పరమల్యాల గ్రామాల మీదుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఆ గ్రామాల్లోని భూముల్లో సర్వేలు నిర్వహించి హద్దులు పాతారు. అంతే మళ్లీ అటువైపు రాలేదు. ఆ గ్రామాలకు చెందిన రైతులు ఏదైనా అవసరం ఉండి భూములు అమ్ముకుందామన్నా వీలు లేకుండా పోయింది. ఏళ్లు గడిచినా పరిహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

గంగాధర, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ నిర్వాసితులు బాధితులు ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గంగాధర మండలం కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి, కాసారం,ఉప్పరమల్యాల గ్రామాల మీదుగా రైల్వే లైను నిర్మాణం నిర్మించడానికి 18 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2020 ఫిబ్రవరిలో బహిరంగా ప్రకటనను విడుదల చేసి రైల్వే లైనులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, బావులు, చెట్లు, పైపులైను, ఇళ్ల వివరాలను ప్రకటించారు. పలుమార్లు అధికారులు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, సర్వేలు నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహించి సర్వేలు చేపట్టడంతో పరిహారం పైసలు వస్తాయని ఆశతో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిహారం కోసం తిరిగి 2024 సెప్టెంబరులో భూసేకరణ కోసం ప్రకటన విడుదల చేశారు. అనంతరం పలుమార్లు కరీంనగర్‌ ఆర్డీవో, భూసేకరణ అధికారులు, రైల్వే అధికారులు గ్రామ సభలు నిర్వహించి ముంపు వివరాలను వెల్లడించి అభ్యంతరాలు కోరారు. ప్రభుత్వాలు మారినా పరిహారం అందడంలేదని బాధితులు వాపోతున్నారు. పరిహారం అందుతుందని కొండంత ఆశతో ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులు అప్పులు చేసి కొందరు ఇళ్లు కట్టుకున్నారు. మరి కొందరు వ్యవసాయ భూములు కొనుక్కున్నారు. ఇటు భూములు తీసుకోక, పరిహారం అందించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఫ భూములు అమ్ముకుందామన్నా ఇబ్బందులు

కొందరు కుటుంబాల్లో పిల్లలకు పెళ్లి చేసేందుకు భూములు అమ్ముకుందామంటే అధికారులు సర్వేలు చేస్తు కాలయాపన చేస్తుండగా ఎటు తోచడం లేదని రైతులు వాపోతున్నారు. ఇటు భూములు అమ్ముకోలేక, పరిహారం అందక మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని ముంపుగ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదే రైల్వే లైనులో కొండన్నపల్లి అటు బోయినపల్లి మండల రైతుల భూములకు గతంలోనే పరిహారం అందించారు. పక్క గ్రామాల రైతులకు పరిహారం అందించి మండలంలోని రంగరావుపల్లి, తాడిజెర్రి, కాసారం గ్రామాల ప్రజలకు పరిహారం అందించక పోవడంతో అసలు నష్ట పరిహారం వస్తుందా రాదానే సందేహం బాధితుల్లో నెలకొందని వాపోతున్నారు.

ఫ ముంపులో ప్రభుత్వ పాఠశాల

రైల్వే నిర్మాణంలో రంగరావుపల్లి ప్రభుత్వ పాఠశాల ముంపునకు గురువుతుంది. ఈ పాఠశాల గ్రామంలో కూడలిలో విద్యార్థులకు అందుబాటులో ఉండగా రైల్వే లైను నిర్మాణంలో పోతుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు గ్రామానికి ఏళ్లుగా మంచినీరందించే బావి రైల్వే లైనులో పోతుంది. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా పాఠశాలను నిర్మించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:13 AM