KCR: గ్రామస్థాయి నుంచి జన సమీకరణ చేయాలి
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:54 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గ్రామ స్థాయి నుంచి జనసమీకరణ చేయాలని, నేతలందరూ సమన్వయంతో పనిచేసి సభను సక్సెస్ చేయాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు.
సమన్వయంతో పని చేసి సభను సక్సెస్ చేద్దాం
బీఆర్‌ఎస్ వైభవాన్ని మరో సారి చూపిద్దాం: కేసీఆర్
మర్కుక్/హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గ్రామ స్థాయి నుంచి జనసమీకరణ చేయాలని, నేతలందరూ సమన్వయంతో పనిచేసి సభను సక్సెస్ చేయాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. బీఆర్‌ఎస్ వైభవాన్ని మరో సారి కాంగ్రె్‌సకు చూపించాలని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లపై శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌ్‌సలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్ల గురించి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఒడితెల సతీష్ వివరించారు. 1200 ఎకరాల్లో సభ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, పార్కింగ్‌కు సంబంధించి పనులు పూర్తి చేశామని తెలిపారు. 16కిలో మీటర్ల అప్రోచ్ రోడ్లు, 11కిలో మీటర్ల వరకు రోడ్డు పొడువునా ర్యాంపులు నిర్మించామని వెల్లడించానే. 10లక్షల వాటర్ బాటిళ్లు, 10లక్షల మజ్జిగ ఫ్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. శనివారం నుంచి సభా వేదిక నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత సారథ్యంలో సభా ప్రాంగణంలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఎర్రబెల్లి, పల్లా డుమ్మా
ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాటికొండ రాజయ్య పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ నేతల మధ్య సమన్వయం లేదని, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి విషయంలో ఎర్రబెల్లికి వ్యతిరేకంగా ఓ వర్గం పావులు కదిపిందనీ ఇటీవల ప్రచారం జరిగింది. ఈ కారణంగానే దేవన్నపేట వద్ద నిర్వహించాల్సిన సభను ఎల్కతుర్తికి తరలించారన్న వాదన ఉంది. అయితే సన్నాహక సమావేశాల్లో బిజీగా ఉండటం వల్లే ఎర్రబెల్లి సమీక్ష రాలేదని, తమలో ఎలాంటి విభేదాలు లేవని పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News