Bhadrachalam: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:05 AM
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమం జరగనుంది. అర్చకులు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.

భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam) రాముల వారి ఆలయం (Sri Rama Temple)లో వసంత పక్ష (Vasantapraksha) ప్రయుక్త శ్రీ రామ నవమి (Sri Rama Navami) బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి. గురువారం గరుడ ధ్వజ పట లేఖనం (Garuda Dhwaja Pata Lekhanam) కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గరుడ ధ్వజ పటావిష్కరణ చేస్తారు. అనంతరం గరుడ ధ్వజాధివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజపటాన్ని లిఖిస్తారు. దానికి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మ కోవెలలో పూజలు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రక్షగా ఉండాలని కోరుతూ గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగరేస్తారు.
Also Read..: స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
కాగా 4న (శుక్రవారం) అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు, 6న నవమి రోజున తిరుకల్యాణం, పునర్వసు దీక్ష ప్రారంభం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 12న చక్రతీర్థం, శ్రీపుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది. శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలకు గవర్నర్, సీఎంలను ఆహ్వానిస్తూ అధికారులు రాజ పత్రాలను అందించారు. కాగా శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News