Home » Khammam
కోడి గుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. చలికాలంలో ధరలు పెరగటం సాధారణమే అయినా ఈస్థాయిలో పెరిగిన దాఖలాలు లేవని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటివరకూ రూ.66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మీరూ అప్పులు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని అంటున్నారు, వాళ్లు దోచుకోటానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
కథా సాహిత్యానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా అన్నారు. ఈస్థటిక్స్ స్పేస్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో మొదలైన కథాంతరంగం సాహిత్య కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్ల మెనూ ఛార్జీలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అదే పెద్దలు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన దంపతులను వారింట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తులే చంపేశారు. దంపతులు డబ్బున్నవారని తెలిసి..
ఇటీవలే చనిపోయిన విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ డబ్బులను ఆయన భార్యకు ఇప్పించేందుకు రూ.40వేలు లంచం అడిగిన సీనియర్ అకౌంటెంట్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రైతు బిడ్డగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఆ దిశగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్షిత.. ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ సాధించారు. కానీ చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె చదువు ఆపేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. చదువుల తల్లిని ఆదుకోమంటూ.. శ్రీహర్షిత దయనీయ కథనాన్ని ప్రసారం చేసింది.
ఇద్దరు కుమారులకు ఆస్తి పంపకానికి సంబంధించిన వివాదంలో ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త చేకూరి సత్యంబాబు(79) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున తన నివాసంలోనే విషం తీసుకొని చనిపోయారు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశారు.