Share News

Tenth Answer Sheets Damaged: పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం.. టెన్త్ ఆన్సర్ పేపర్లు డ్యామేజ్

ABN , Publish Date - Mar 29 , 2025 | 03:24 PM

Tenth Answer Sheets Damaged: పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పదో తరగతి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. టెన్త్ ఆన్సర్ పేపర్లు తరలించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Tenth Answer Sheets Damaged: పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం.. టెన్త్ ఆన్సర్ పేపర్లు డ్యామేజ్
Tenth Answer Sheets Damaged

ఖమ్మం జిల్లా, మార్చి 29: జిల్లాలోని కారేపల్లిలో పోస్టల్ సిబ్బంది (Postal Staff) నిర్లక్ష్యం బయటపడింది. పదో తరగతి పరీక్షలకు (Tenth Exams) సంబంధించిన సైన్స్ పేపర్ 1 ఆన్సర్ షీట్లను (Tenth Answer Papers) తరలించడంతో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థులు (Students), తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా టెన్త్ పరీక్షల ఆన్సర్ పేపర్లు తరలిస్తుండటంతో అవి నలిగి పోయి డ్యామేజ్ అయ్యాయి. దీంతో పదో తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎంతో జాగ్రత్తగా, భద్రంగా తీసుకెళ్లాల్సిన పదో తరగతి ఆన్సర్ పేపర్లను చిత్తు కాగితాల మాదరిగా మూటగట్టి తీసుకెళ్లడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉండగా.. ఈ విధంగా పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని మండిపడుతున్నారు. తాము రాసిన ఆన్సర్ షీట్లు ఎక్కడ చిరిగిపోయాయో అని.. వాల్యూయేషన్ చేసే సమయంలో సిబ్బంది వీటిని ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటారో అని, మార్కులు ఏ విధంగా వేస్తారో అని భయపడుతున్న పరిస్థితి. కారేపల్లిలో పదో తరగతి పరీక్షలు జరిగిన తర్వాత సైన్స్ పేపర్ 1కు సంబంధించి ఆన్సర్ పేపర్లను పోస్టల్ సిబ్బంది జాగ్రత్తగా ప్యాక్ చేసి తరలించాల్సి ఉంది.


అయితే ఆన్సర్ పేపర్లను సరైన విధంగా ప్యాక్ చేయకుండా పేపర్లను తరలించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ పేపర్లను పోలీసు భద్రతతో తీసుకెళ్లి పరీక్షా కేంద్రాల్లో ఇచ్చి, విద్యార్థుల చేత పరీక్షలు రాయిస్తారో.. అదే విధంగా పరీక్ష రాసిన పేపర్లను కూడా అంతే జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆన్సర్ పేపర్లను తరలించడంతో విద్యాశాఖ అధికారులు, పోస్టల్ సిబ్బంది మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డ్యామేజ్ అయిన ఆన్సర్ పేపర్ల పరిస్థితి ఏంటి అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


ఇవి కూడా చదవండి

Palla Srinivas Speech: ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు వెంటే నేనూ

Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 29 , 2025 | 03:44 PM