Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:43 AM
విద్యుత్ ఉత్పత్తితోపాటు ఇతర రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ముగిసిన బొగ్గు, గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ ఉత్పత్తితోపాటు ఇతర రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఒడిశాలోని కోణార్క్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన 3వ బొగ్గు, గనుల శాఖ మంత్రుల జాతీయ సమావేశం మంగళవారం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్రమత్రి కిషన్ రెడ్డి పలు కీలక అంశాలపై మాట్లాడారు. గనుల్లో కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. బొగ్గు ఉత్పత్తి పెంచడం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరారు. అంతర్జాతీయంగా వినియోగిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడంపైనా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల మంత్రులు.. తమ ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్థతులను వివరించారు. అనంతరం డిస్ర్టిక్ట్ మినరల్ ఫౌండేషన్ ప్రదర్శనను కేంద్రమంత్రి సందర్శించారు. స్వయం సహాయక బృందాల ద్వారా తయారైన ఉత్పత్తులను పరిశీలించారు. భువనేశ్వర్‌లో మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ పనితీరును కిషన్ రెడ్డి సమీక్షించారు. ’
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే