Kolipaka Srikrishna: యూపీఎస్సీ ఫలితాల కోసం చూస్తున్నా
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:39 AM
కొలిపాక శ్రీకృష్ణ సాయి, సివిల్స్ కోసం చేసిన 4 ప్రయత్నాల తర్వాత గ్రూప్-1లో 519 మార్కులతో 10వ ర్యాంకు సాధించారు. సామాజిక శాస్త్రాలపై ఆసక్తి పెరిగిన శ్రీకృష్ణ, 10 గంటలు ప్రతిరోజూ చదువుతూ ఈ విజయాన్ని సాధించారు

మాది హన్మకొండ. మా నాన్న విష్ణు న్యాయవాది. అయినా, నాకు సామాజిక శాస్త్రాల పట్ల చిన్నప్పుడు ఆసక్తి తక్కువనే చెప్పాలి. వరంగల్ నిట్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో సామాజిక శాస్త్రాలపై ఇష్టం మొదలైంది. ఆర్థిక, రాజనీతి శాస్త్రాలు, రాజ్యాంగం... సంబంధిత అంశాలు చదవడం, దినపత్రికల ద్వారా సమకాలీన విషయాలపై అవగాహన పెంచుకోవడం నా దినచర్యలో భాగమైంది. అలా సామాజిక విషయాలను అధ్యయనం చేస్తున్నకొద్దీ సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లాలన్న ఆకాంక్ష మొదలైంది. ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే 2020లో యూపీఎస్సీకి సిద్ధమయ్యాను. ప్రతికూల ఫలితం వచ్చినా వెనక్కితగ్గలేదు. నాలుగోసారి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించాను. ఈ ఏడాది జనవరిలో ఇంటర్వ్యూకు వెళ్లాను. ప్రస్తుతం ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సమయంలో గ్రూప్-1లోనూ 519 మార్కులతో 10వ ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. సివిల్స్, గ్రూప్-1కు సొంతంగా సిద్ధమయ్యాను. రోజుకు కనీసం పది గంటలు చదివాను. నా ర్యాంకు ఆధారంగా డిప్యూటీ కలెక్టరు పోస్టు వస్తుంది.
-కొలిపాక శ్రీకృష్ణ సాయి, పదో ర్యాంకు
ఇవి కూడా చదవండి:
మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..
ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..