Share News

ప్రజా సమస్యలే ‘ఆంధ్రజ్యోతి’ ఎజెండా

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:45 AM

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండ యూనిట్‌ కార్యాలయంలో జరిగిన కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ డ్రా కార్యక్రమానికి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుతులకు సంబంధించి డ్రా తీశారు.

ప్రజా సమస్యలే ‘ఆంధ్రజ్యోతి’ ఎజెండా

  • నిర్భయంగా రాయడం పత్రిక ప్రత్యేకత

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • నల్లగొండలో కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ డ్రా తీసిన మంత్రి

  • ఖమ్మం, నిజామాబాద్‌లో డ్రా తీసిన కలెక్టర్లు

నల్లగొండ/ఖమ్మం కలెక్టరేట్‌/డిచ్‌పల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): భయం లేకుండా, ప్రజా సమస్యలే ఎజెండాగా ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ముందుకు సాగుతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పత్రిక అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో ఎరురున్నా భయపడకుండా.. ఉన్నది ఉన్నట్లు రాయడం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకత అని కొనియాడారు. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండ యూనిట్‌ కార్యాలయంలో జరిగిన కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ డ్రా కార్యక్రమానికి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుతులకు సంబంధించి డ్రా తీశారు. విజేతలు కార్తీక్‌, వెంకటేశం, శంకర్‌రావుకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఏటా అక్కా చెల్లెమ్మలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పాఠకులకు రూ.కోటి బహుమతులు అందజేయడం హర్షించదగిన విషయమన్నారు.


ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వసనీయ వార్తలతోనే పత్రికలను ప్రజలు ఆదరిస్తారని.. పత్రికలు ప్రజలకు సమాచార వేదికలుగా పనిచేయాలని ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. సమాజంలో విలువలు, విశ్వసనీయత, నిజాయితీని ఆంధ్రజ్యోతి పత్రిక కాపాడుతోందని అభినందించారు. ఖమ్మంలోని ఆంధ్రజ్యోతి యూనిట్‌ కార్యాలయంలో సోమవారం ఆంధ్రజ్యోతి జిల్లా స్థాయి లక్కీడ్రా కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలు తాటి రాజశేఖర్‌, వెలిశాల శివరాణి, కొమ్ము భవానిరాజ్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అధికారులకు మార్గదర్శకంగా పత్రికలు పనిచేయాలని సూచించారు. సమాజంలో తనదైన పాత్రను పోషిస్తున్న ఆంధ్రజ్యోతికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. దమ్మున్న వార్తలు ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకమని నిజామాబాద్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) శివారులోని ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్‌ కార్యాలయంలో ‘ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ కూపన్ల డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాదిగా వచ్చిన కూపన్ల నుంచి మొదటి బహుమతి విజేతను ఎంపిక చేశారు. ఎడపల్లికి చెందిన తిరునగరి వెంకటరమణకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కిరణ్‌ కుమార్‌ మాట్లాడారు. నిజాలను నిర్భయంగా రాస్తూ దమ్మున్న పత్రికగా ‘ఆంధ్రజ్యోతి’కి పేరు ఉందన్నారు. పాఠకులకు బహుమతులు ఇచ్చే గొప్ప సంప్రదాయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కొనసాగించడం అభినందనీయమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 04:45 AM