Konda Surekha: మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీలను తీసుకోరనుకుంటున్నా: సురేఖ
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:02 AM
మంత్రివర్గంలోకి శాసనమండలి సభ్యులను తీసుకోరనే తాను భావిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. శాసనమండలిలో సీనియర్లు చాలా మంది ఉంటారని, ఒకరికి ఇస్తే పోటీ పెరుగుతుందని చెప్పారు.

మంత్రివర్గంలోకి శాసనమండలి సభ్యులను తీసుకోరనే తాను భావిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. శాసనమండలిలో సీనియర్లు చాలా మంది ఉంటారని, ఒకరికి ఇస్తే పోటీ పెరుగుతుందని చెప్పారు. అయితే అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు. అయినా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందని అనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పుపై బీజేపీ నేతలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన పేరును కేంద్ర సంస్థలకు పెట్టుకుంటే తమకే అభ్యంతరం లేదన్నారు.