Konda Vishweshwar Reddy: బీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్పు రూ.8 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:51 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రభుత్వ భూములను అమ్ముకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

బీఆర్‌ఎస్ దారిలోనే కాంగ్రెస్: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రభుత్వ భూములను అమ్ముకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ దారిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్లాలని చూస్తోందని చెప్పారు. భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.