ఘనంగా కొఠాయి ఉత్సవం
ABN , Publish Date - Jan 06 , 2025 | 02:09 AM
ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా కొఠాయి ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వర దేవాలయం ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- వనమహోత్సవంలో పాల్గొన్న భక్తులు
కోరుట్ల రూరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా కొఠాయి ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వర దేవాలయం ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకం నిర్వహించి వేడుకలను జరిపారు. ఉ త్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణం జరిపారు. అనంతరం భక్తులకు కొత్త సురేష్ - స్వరూప దంపతులు అన్న ప్రసాదం అందజేశారు. శ్రీవేంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో విక్రం ఆలయ ప్ర ధాన అర్చకుడు బీర్నంది నరిసింహా చారి వామన్, దేవాలయ సిబ్బంది నర్సయ్య, వెంటా పూర్ మాజీ సర్పంచ్ తోట లింగారెడ్డి, వేంకటాపూర్ వేంకటేశ్వర దేవాలయ చైర్మెన్ కటుకం రాజేశం, ఆండాల్ గోష్టి బృందం సభ్యులు పాల్గొన్నారు.