Share News

కుంగ్‌ఫూతో ఆత్మస్థయిర్యం పెంపొందుతుంది

ABN , Publish Date - Jan 06 , 2025 | 02:11 AM

కుంగ్‌పూ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతో పాటు, ఆత్మరక్షణకు ఉపయోగ పడుతుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో డ్రాగన్‌ స్వార్డ్‌ కుంగ్‌,పూ అకాడమీ ఆధ్వర్యంతో నిర్వహించిన బెల్ట్‌ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయ న ముఖ్య అథితిగా హజరయ్యారు.

కుంగ్‌ఫూతో ఆత్మస్థయిర్యం పెంపొందుతుంది

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

ధర్మపరి, జనవరి, 5 (ఆంధ్రజ్యోతి) కుంగ్‌పూ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతో పాటు, ఆత్మరక్షణకు ఉపయోగ పడుతుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో డ్రాగన్‌ స్వార్డ్‌ కుంగ్‌,పూ అకాడమీ ఆధ్వర్యంతో నిర్వహించిన బెల్ట్‌ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయ న ముఖ్య అథితిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ప్రతి భ కనబరిచిన 150 మంది విద్యార్థులకు బెల్టులు అం దజేశారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షన అందిస్తున్నామని ఆయన తెలిపారు. చిన్నతనం నుండే కుంగ్‌పూలో శఙక్షణ పొందడం అభినందనీయం అన్నా రు. ఈ సంధర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్య క్రమంలో డ్రాగన్‌ స్వార్డ్‌ అకాడమీ పౌండర్‌ రాజమ ల్లు, ప్రెసిడెంట్‌ రాజేందర్‌, జనరల్‌ సెక్రేటరీ కస్తూరీ ప్రవీణ్‌, ఆర్గనైజర్‌ చ్ద్రయ్య, లింగంపల్లి రమేష్‌, టీపీసీసీ సబ్యులు సంగనభట్ల వినేష్‌, ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేముల నాగలోఈ్మ, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 02:11 AM