Share News

10.30లక్షల పనిదినాలు గాయబ్‌

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:28 PM

ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం పనిదినాలను కుదించింది.

10.30లక్షల పనిదినాలు గాయబ్‌
ఉండవెల్లి మండలం బొంకూరులో పనులు చేస్తున్న కూలీలు

- ప్రతిపాదించినది 23.84లక్షలు

- అనుమతించిన పనిదినాలు 13.54లక్షలే...

- రూ.12కోట్ల వేతనాలు కోల్పోతున్న కూలీలు

- వందరోజుల పనిదినాలు కష్టమే..!

గద్వాల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం పనిదినాలను కుదించింది. గత ఏడాది కూలీలకు 23.20లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం పెట్టుకోగా 24.19లక్షలు పనిదినాలు కల్పించింది. ఈ ఏడాది కూడా 23.84లక్షల పనిదినాలకు లేబర్‌ బడ్జెట్‌ను ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం 13.54 లక్షల పనిదినాలకే అనుమతించింది. అంటే దాదాపు 10.30 లక్షల పనిదినాలు గాయబ్‌ అ య్యాయి. దీంతో జిల్లాలో కూలీ లు రూ.12కోట్ల వేతనాలు(ఆదా యం) కోల్పోయే పరిస్థితి ఉంది. ఉపాధిలో కూలీలకు రోజుకు రూ.307 కూలీ ఇవ్వాల్సి ఉండగా గత ఏడాది సగటున రూ.198 వేతనం లభించింది. ఈ ఏడాది ఇది రూ. 300లకు పైగా పడేవిధంగా కొలతలతో పనులు నిర్వహించి వేతనం (ఆదాయం) తగ్గకుండా చూడాల ని అదేశించింది. ఆడిట్‌ భయంతో టెక్నికల్‌ అసి స్టెంట్లు కొలతలు ఇచ్చి మరీ పనిచేయిస్తున్నారు. దీంతో పనిచేతకాని కూలీలు ఉపాధి పనులకు రావడం కష్టంగా ఉంది.

ఫీల్డ్‌ అసిస్టెంట్లు లక్ష్యం చేరడం కష్టమే...!

గత ప్రభుత్వంలో రాగా సాఫ్ట్‌వేర్‌ సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లకు టార్గెట్‌లు పెట్టేవారు. ఎవరు ఎక్కువ పనిదినా లు కల్పిస్తే వారికి జీతం ఎక్కువ వచ్చేది. తక్కువ పనిదినాలు కల్పించి న వారికి తక్కువ జీతం వచ్చేంది. ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ వచ్చిన తర్వాత కూడా ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీతాల చెల్లింపులు రాగా సాఫ్ట్‌వేర్‌ పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో తక్కువ పనిదినాలు కల్పించిన వారిని తొలగించేవారు. ఇప్పుడు ఏకంగా 10.30లక్షల పనిదినాలు తగ్గించడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు లక్ష్యాన్ని చేరడం కష్టంగా ఉంది.

తగ్గిన కూలీల సంఖ్య

ఉపాధి హామీ పథకం పనులు నిర్వాహణలో సమూల మార్పుల కారణంగా కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వానికి పంపించిన లేబర్‌ బడ్జెట్‌ ప్రకారం ఏప్రిల్‌ నెలలో 5.97లక్షల పనిదినాలు కల్పించాలి. కానీ ఇప్పటి వరకు 80వేల పని దినాలను మాత్రమే నిర్వహించారు. మరో పదిరోజులు అయిన లక్ష పనిదినాలు దాటని పరిస్థితి ఉంది. గత ఏడాది రోజు 15వేల నుంచి 20వేల మంది కూలీలు వచ్చే వారు ఇప్పుడు 7వేల నుంచి 8వేల మంది కూలీలు కూడ రావడం లేదు.

Updated Date - Apr 23 , 2025 | 11:28 PM