Share News

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:57 PM

అఖండ భారతదేశాన్ని వి చ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్‌ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు.

 అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర
ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేస్తున్న న్యాయవాదులు

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌/టౌన్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): అఖండ భారతదేశాన్ని వి చ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్‌ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. కశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా జిల్లా కేంద్రం లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో న్యాయవాదులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి నిర సన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హాజరై మాట్లా డారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.వినోద్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎన్పీ వెంకటేష్‌, గుండా మనోహర్‌, వీరబ్రహ్మ చారి, రమాకాంత్‌గౌడ్‌, మురళికృష్ణ, లక్ష్మ య్య, కృష్ణయ్య, అనంతచారి, శ్రీపాదరావు, విక్రంగౌడ్‌, కృష్ణయ్య పాల్గొన్నారు.

ఉగ్రవాదం నశించాలి

ఉగ్రవాదం నశించాలనే డిమాండ్‌తో గురు వారం రాత్రి జి ల్లా మైనారిటీ కాంగ్రెస్‌ పార్టీ ఆ ధ్వర్యంలో నిర్వ హించిన కొవ్వొ త్తుల ర్యాలీలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, దేవ ర్‌కద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌ రెడ్డి, మహబూ బ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్‌ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌లు పాల్గొన్నారు. మృతులకు ఘనంగా నివాళ్లు అర్పించారు. మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, మైనారిటీ సెల్‌ అధ్యక్షు డు ఫయాజ్‌, ముడా చైర్మన్‌ల క్ష్మణ్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనితరెడ్డి, సీనియర్‌ నాయకులు ఎన్పీ వెంకటేశ్‌, సిరాజ్‌ ఖాద్రి, షబ్బీర్‌ ఆహ్మద్‌, అజ్మత్‌, సల్మాన్‌, అవీజ్‌, సాయిబాబా, రాములు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో ర్యాలీ

పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి నిరసనగా జిల్లా మాజీ సైనికుల సంఘం తరుఫున కొవ్వొ త్తులతో అమరవీరుల స్తూపం నుంచి అంబే డ్కర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వ హించారు. ఇందులో మా జీ సైనికుల సంఘం అధ్య క్షుడు వేణుగోపాల్‌రెడ్డి, జ నరల్‌ సెక్రటరీ నాగేశ్వర్‌, అడ్వయిజర్‌ కె.వెంకటయ్య గౌడ్‌, గౌరవాధ్యక్షుడు ఎం ఆర్‌కె.రెడ్డి వైస్‌ ప్రెసిడెంట్‌ రాములు, జమీల్‌, శేఖర్‌ రెడ్డి, హన్మంతు, రఘు, ప్రసాద్‌తో పాటు పలువు రు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:57 PM