వైభవంగా రథోత్సవం
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:36 PM
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని సోలీపూర్ దత్త పీఠం శ్రీ దత్తాత్రేయ శ్రీరామధూత శ్రీలక్ష్మి నరసింహ స్వామి యోగానంద సద్గురు స్వా ముల వారి సప్తాహ సహిత ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఆలయం ఆవరణంలో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన రథోత్సవం కార్యక్రమా నికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు.
ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని సోలీపూర్ దత్త పీఠం శ్రీ దత్తాత్రేయ శ్రీరామధూత శ్రీలక్ష్మి నరసింహ స్వామి యోగానంద సద్గురు స్వా ముల వారి సప్తాహ సహిత ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఆలయం ఆవరణంలో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన రథోత్సవం కార్యక్రమా నికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని వి ద్యుత్ దీపాలతో, బంతిపూలతో అందంగా అలంకరించారు. ఆలయం శోభ ఉట్టిపడే విధంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. శనివారం అర్ధరాత్రి అనంతరం ప్రారంభమైన రథోత్సవ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. యోగానంద స్వాము ల వారి ఉత్సవ విగ్రహం, స్వామి వారి పాదుకలను మంగళ వాయి ద్యాల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఊరేగించారు. రథంలో ప్రతిష్ఠించి, తేరు ముందు అన్నంతో కుంభరాశులు పోసి ప్ర త్యేక పూజలు చేసిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారం భించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు వ్రతాన్ని లాగానికి ఆసక్తిని కనబరిచారు. ఆలయంలో భక్తులు అఖండ భజనలు నిర్వహించారు. మహిళలు బొడ్డెమ్మలు, ప్రత్యేక ఆటలు, టపాకాయల శబ్ధాలతో ఆల యం ఆవరణం సందడిగా మారింది. స్వామి వారి ఆరాధన ఉత్స వాల్లో భాగంగా ఆదివారం చివరి రోజు కోనేరులో స్వామి వారి విగ్ర హాలకు చక్రస్నానం నిర్వహించారు. భక్తులు లక్ష్మి నరసింహ యో గానంద స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చె ల్లించుకున్నారు. స్వామివారి ఉత్సవాలలో చివరి ఘట్టం చక్రస్నానా న్ని వీక్షించడానికి పరిసర గ్రామాల భక్తులు వందలాదిగా తరలివ చ్చారు. చక్రతీర్థంను పూజారులు భక్తులకు అందజేశారు.