Share News

బోరు మోటార్‌ తీయబోయి యువకుడి దుర్మరణం

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:26 PM

వ్యవసాయ బావిలో బోరు మోటార్‌ను తీయ బోయి ప్రమా దవశాత్తు నీటిలో ము నిగి మృతి చెందిన సంఘటన శనివారం వనపర్తి జిల్లా అమర చింత మునిసిపాలిటీలో చోటు చేసుకుంది.

బోరు మోటార్‌ తీయబోయి యువకుడి దుర్మరణం

అమరచింత, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ బావిలో బోరు మోటార్‌ను తీయ బోయి ప్రమా దవశాత్తు నీటిలో ము నిగి మృతి చెందిన సంఘటన శనివారం వనపర్తి జిల్లా అమర చింత మునిసిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అమరచింత ప ట్టణానికి చెందిన రైతు గోపాల్‌రెడ్డి వ్యవసా య బావిలోని మోటార్‌ను మరమ్మతు ని మిత్తం తీయడానికి గుడిసె శ్రీను (28) శ నివారం వెళ్లాడు. బావిలోని నీటిలో బోరును బయటకు తీయడానికి తీవ్ర ప్రయత్నం చే సే క్రమంలో ఆ బోరుతో పాటు నీటిలో యువకుడు పూర్తిగా మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. సాయంత్రం కుటుం బ సభ్యులు, ప్రజలు వెళ్లి అతి కష్టం మీద మృతుడిని బావిలో నుంచి బయటకు తీశా రు. అతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:26 PM