కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:19 PM
భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని జిల్లా ప్రధాన కార్యదర్శి స్నిగ్దారెడ్డి అన్నారు.
- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్నిగ్దారెడ్డి
అయిజటౌన్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని జిల్లా ప్రధాన కార్యదర్శి స్నిగ్దారెడ్డి అన్నారు. ఆ దివారం అయిజలో పట్టణ పార్టీ అధ్యక్షుడు భగత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలోనే దేశం అన్నిరంగాల్లో ముందుందని తెలిపారు. నడిగడ్డలో కూడా రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేద్దామని అన్నారు. ఈసందర్భంగా పార్టీ అభివృద్ధికి పాటుపడే కార్యకర్తల ప్రతిపాదిత జాబితాను ఆమెకు అందించారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు భీంసేన్‌రావ్, ప్రదీప్‌స్వామి, శివారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పట్టణ కార్యకర్తలు పాల్గొన్నారు.