Share News

వక్ఫ్‌ చట్టం సవరణతో ముస్లింలకు అన్యాయం

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:41 PM

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన వక్ఫ్‌చట్టం సవరణ బిల్లుపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి.

వక్ఫ్‌ చట్టం సవరణతో ముస్లింలకు అన్యాయం
ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల పట్టణంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

- మద్దతు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన వక్ఫ్‌చట్టం సవరణ బిల్లుపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం గద్వాల పట్టణంలోని ఈద్గా మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించాయి. మోదీ చేసిన వక్ఫ్‌ చట్టం సవరణతో ముస్లిం వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తమ ఆ స్థులకు ఇబ్బంది కలిగేవిధంగా చట్టంలో మార్పులు చేశారని మండి పడ్డారు. గాంధీ, జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూ లమాల వేసి నివాళ్లు అర్పించారు. నిరసన ర్యాలీకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత, ముని సిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో పాటు సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, ప్రజా సం ఘాలు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్డాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించు, పాలించు అనే విధానాన్ని అవ లంభిస్తోందని విమర్శించారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత మాట్డాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ ఆస్తులను కొల్లగొట్టేందుకే వక్ఫ్‌ సరవణ చ ట్టం చేసిందని విమర్శించారు. అనంతరం ముస్లిం సంఘాలతో కలిసి అదనపు కలెక్టర్‌ నర్సింగరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో ముస్లిం నాయకులు ఇసాక్‌, షఫి ఉల్లా, మక్బూల్‌, గౌస్‌, వెంకట్రాము లు, ఆంజనేయులు, వెంకటస్వామి ఉన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:41 PM