Share News

మానవ వ్యర్థాలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:04 PM

మాన్యువల్‌గా మానవ వ్యర్థాలపై ప్రజల కు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సంబంధిత అధికారులకు పలు సూచనలు చే శారు.

  మానవ వ్యర్థాలపై అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మాన్యువల్‌గా మానవ వ్యర్థాలపై ప్రజల కు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన మాన్యువల్‌ స్కావెంజింగ్‌ (మానవ వ్యర్థాలు)పై సర్వే చేసేందుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ పారదర్శ కంగా, గోప్యతకు తావు లేకుండా సర్వే నిర్వహించి రిపో ర్టు తయారు చేయాలన్నారు. అలాగే మాన్యువల్‌గా మానవ వ్చర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభు త్వం నమస్తే స్కీం, నమస్తే పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. దేశం మొత్తం మాన్యువల్‌ స్కావెంజింగ్‌ (మానవ వ్యర్థాలు) ఇంకా ఎక్కడైన జరుగుతుందా అని తెలుసుకునేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి లో సర్వే కమిటీల ఏర్పాటు కు ఆదేశాలు జారీ చేసిన ట్లు తెలిపారు. కలెక్టర్‌ చైర్‌ పర్సన్‌గా, షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యదర్శి గా, ముఖ్య ప్రణాళిక అధికా రి, మునిసిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, రైల్వేస్టేషన్‌ మాస్టర్లు సభ్యు లుగా, సీఐటీయూ స్టేట్‌ లీడ ర్‌ కమ్యూనిటీ ప్రతినిధిగా ఉంటారని తెలిపారు. మాన్యు వల్‌ స్కావెంజింగ్‌ ఉందా తెలుసుకునేందుకు పంచాయతీ అధికారి, మునిసిపల్‌ కమిషనర్లు సర్వే నిర్వహించి నమ స్తే స్కీం, నమస్తే పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచిం చారు. సర్వే చేసేందుకు ఎన్యూమరేటర్స్‌ను ఎంచుకొని వారికి సర్వేపైన అలాగే ఎం ఎస్‌ యాప్‌పై శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించాలని సూచించారు. సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌ రావు, కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Updated Date - Mar 27 , 2025 | 11:04 PM