Share News

బల్దియాకే బురిడీ

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:25 PM

వనప ర్తి మునిసిపాలిటీలో చికెన్‌, చేపల వ్యర్థాలను తరలించ డానికి గత ఏడాది జూలైలో మునిసిపల్‌ కార్యాలయంలో ఎ నిమిది నెలల కాలపరిమితితో బ హిరంగ వేలం నిర్వహించారు.

బల్దియాకే బురిడీ
టెండర్‌ రద్దు చేసి జీవనాధారం కల్పించాలని మునిసిపాలిటీ ఎదుట ధర్నా చేస్తున్న ఎరుకలి కులస్థులు (ఫైల్‌)

- ఆదాయ సొమ్ము ఎగ్గొట్టిన ఘనుడు

- చికెన్‌ వ్యర్థాల తరలింపు టెండర్‌లో మునిసిపల్‌ ఆదాయానికి గండి

- గత ఏడాది రూ. 29.20 లక్షలు టెండర్‌ పలికిన వ్యర్థాల వేలం

- కేవలం రూ. 10 లక్షలు మాత్రమే చెల్లించిన టెండర్‌దారుడు

- పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టించిన మునిసిపల్‌ అధికారులు

- మళ్లీ ఈ నెల 29న బహిరంగ వేలానికి ఏర్పాట్లు

వనపర్తి టౌన్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): వనప ర్తి మునిసిపాలిటీలో చికెన్‌, చేపల వ్యర్థాలను తరలించ డానికి గత ఏడాది జూలైలో మునిసిపల్‌ కార్యాలయంలో ఎ నిమిది నెలల కాలపరిమితితో బ హిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో అత్యధికంగా రూ. 29.20 లక్షలకు సిలమార్తి ఆంజనేయు లు అనే టెండర్‌దారుడు పాల్గొని వేలం దక్కించుకున్నాడు. దాదాపు నెలరోజుల త రువాత టెండర్‌ సొమ్మును చెల్లించలేని కారణంగా మొదటి వ్యక్తి టెండర్‌ను రద్దు చేసి రెండో టెండర్‌ దారుడు చీర్ల గోపికృష్ణ సాగర్‌ కు అప్పగించారు. టెండర్‌ పొందిన వ్యక్తి ఎనిమిది నెలల కాలానికి గా ను కేవలం రూ. 10 లక్షలు మాత్రమే చెల్లించాడు. జూలై నెల నుంచి మార్చి నెలతో టెండర్‌ కాలపరిమితి ముగించడంతో కొత్తగా టెండర్‌ నిర్వహించడానికి మునిసిపల్‌ అధికారులు సిద్ధమవుతున్నారు.

వాహనాన్ని స్వాధీనం చేసుకొని....

టెండర్‌ దక్కించుకున్న వ్యక్తి కేవలం రూ. 10 లక్షలు మాత్రమే చెల్లించి మి గతా రూ. 19.20 లక్షల టెండర్‌ సొమ్మును చెల్లించకుండా మునిసిపల్‌ ఆదా యానికి కుచ్చుటోపి పెట్టాడు. పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినా టెండ ర్‌ దారుడు స్పందించకపోవడంతో చికెన్‌, చేపల వ్యర్థాలను తరలించడానికి ఉపయోగించే బొలెరో వాహనాన్ని మునిసిపల్‌ అధికారులు స్వాధీనం చేసుకు ని, కార్యాలయ ఆవరణంలో 28 రోజుల పాటు ఉంచారు. అయినప్పటికీ ఫలి తం లేకపోవడంతో గోపీకృష్ణ సాగర్‌ అనే టెండర్‌ దారుణ్ని డీఫాల్టర్‌గా చూపించి, టెండర్‌ సొమ్ము రికవరీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సొమ్మును ఎగ్గొట్టిన కారణంగా నమోదైన పోలీస్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీతో ఫైల్‌ పుటప్‌ చేసి మునిసిపల్‌ అధికారులు కలెక్టర్‌ను కలిసి తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

అధికారుల లోపంతోనే...

బహిరంగ వేలం నిర్వహించిన తరువాత టెండర్‌ పొందిన వ్యక్తితో వెంటనే బాండ్‌ పేపర్‌పై ఒప్పం దం చేసుకుని, వ్యర్థాలను తరలించ డానికి ఉపయోగించే వాహనం నెంబర్‌ను నమోదు చేసుకోవాలి. తరువాత రెండు బ్యాంక్‌ ఖాళీ చెక్కులను కూడా ముందస్తు గా సేకరించి మునిసిపల్‌ అధికారుల ఆధీనంలో పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల టెండర్‌ పొందిన వ్యక్తి మునిసిపల్‌ ఆదాయాన్ని సులువుగా దోచుకున్నాడు. టెండర్‌ డబ్బులను స్వాహా చేసిన వ్యక్తికి కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరించడంతోనే మునిసిపల్‌ ఖజానాలో జమ కావాల్సిన ప్రజా సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందని పలువురు పుర ప్రముఖులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ నెల 29న నిర్వహించే కొత్త టెండర్‌లోనైనా నిబంధనలు సక్రమంగా అమలు చేసి మునిసిపల్‌ ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత అధికా రులు, ప్రజా ప్రతినిధులపై ఉంది.

నిబంధనలు అమలు చేస్తాం

గత ఏడాది జరిగినట్లు పొరపాట్లు జరగకుండా ప్రభు త్వ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తాం. ఈసారి టెండర్‌ పొందిన వ్యక్తితో ముందుగానే చెక్కులు తీసుకుని, అగ్రిమెంట్‌ చేసుకుంటాం. గత ఏడాది టెండర్‌ దక్కించుకు న్న టెండర్‌ దారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాం. తదుపరి కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఒక్క పైసా కూడా వదిలిపెట్టేది లేదు.

- వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కమిషనర్‌, వనపర్తి

Updated Date - Apr 25 , 2025 | 11:25 PM