Share News

ఉత్తమ సేవలు అందించాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:24 PM

పీహెచ్‌సీలలో ప్రజలకు ఉత్త మ వైద్య సేవలను అందించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీంద్రనాయక్‌ అన్నారు.

ఉత్తమ సేవలు అందించాలి
స్టోర్‌లో మందుల వివరాలను పరిశీలిస్తున్న డాక్టర్‌ రవీంద్ర నాయక్‌

- డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీంద్ర నాయక్‌

- జిల్లాలో ఆకస్మిక పర్యటన.. పీహెచ్‌సీల తనిఖీ

- ఆరోగ్య కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష

వనపర్తి వైద్యవిభాగం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): పీహెచ్‌సీలలో ప్రజలకు ఉత్త మ వైద్య సేవలను అందించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీంద్రనాయక్‌ అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలో అకస్మికంగా పర్యటించిన ఆయన కొత్తకోట, మదనాపురం పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. అక్కడ అందిస్తున్న ఆరోగ్య సేవలను, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూనే ఉండాలన్నారు. ప్రజలకు గుణాత్మకమైన ఆరోగ్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల (నేషనల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్స్‌) అమలు పరిస్థితి, మాతృ శిశు ఆరోగ్య సేవలు, టీకా కార్యక్రమాల నిర్వహణ, జనన మరణ నమోదు, ఔషధాల నిల్వలపై అప్రమత్తంగా ఉండాల న్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, జాన్సీ, రియా, పరిమళ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:24 PM