Share News

మళ్లీ బెట్టింగ్‌లు

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:35 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లు.. ఆన్‌లైన్‌ గేమింగ్‌లు మళ్లీ కొనసాగుతున్నాయి.

మళ్లీ బెట్టింగ్‌లు

హోటళ్లు, బార్లు బెట్టింగ్‌లకు అడ్డాలు

కీలకపాత్ర పోషిస్తున్న కొందరు ఉద్యోగులు

గద్వాల క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లు.. ఆన్‌లైన్‌ గేమింగ్‌లు మళ్లీ కొనసాగుతున్నాయి. జిల్లాలో కొంద రు ఇదేపనిగా బెట్టింగ్‌లపై ప్రతీయేటా లక్షలు సంపా దిస్తున్నారు. ఐపీఎల్‌ ప్రారంభం కావడంతో మళ్లీ బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జి ల్లాలో యువకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యా పారులు కూడా బెట్టింగ్‌లకు బానిసై దళారుల ఉచ్చు లో పడుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు కూడా వీటి బుకీలుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు ఇతర ఉపాధ్యాయులను ఉచ్చులోకి దింపుకొని వారిని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లలో పాల్గొనేలా చేస్తున్నట్లు తెలుస్తుంది.

నాలుగు రోజుల నుంచి..

ప్రస్తుతం ప్రారంభమైన ఐిపీఎల్‌ మ్యాచ్‌ ల సందర్భంగా బంతిబంతికి ఒకరేటును బుకీలు నిర్ణయిస్తున్నారు. అంతేకాకుండా ఆటలో పాల్గొనే వారికంటే బుకీలుగా ఉన్నవారికి 10శాతం కమీషన్‌ రావడంతో ఈ బుకీలు ఎక్కువగా బెట్టింగ్‌లు వేసేవారిపై దృష్టి సారిస్తున్నారు. బెట్టింగ్‌లో గెలిచిన వారికి ఒక టికి పదిరెట్లు చెల్లిస్తూ యువతను ఆకట్టుకుంటు న్నారు. యువకులు తమ దగ్గర డబ్బు లేకున్నా తమ బైక్‌ల ను, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బెట్టింగ్‌ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరి కొందరు వడ్డీకి తెచ్చి బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. కొందరు యువకులు తమ ఇంట్లోనే దొంగలుగా మారి వస్తువుల ను ఎత్తుకెళ్లి బెట్టింగ్‌లకు ధారపోస్తున్నారు.

బెట్టింగ్‌లలో ప్రభుత్వ ఉద్యోగుల

ఐపీఎల్‌ మ్యాచ్‌లలో పందెం కాస్తూ రాత్రికి రాత్రి లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలని కొందరు బుకీ లు ఉపాఽధ్యాయులను పావులుగా వాడుకుంటున్నా రు. ఇటీవలే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లకు అలవాటు పడ్డ ఉపాధ్యాయులు గతంలో బెట్టింగ్‌లలో ఓడిపోయి ఒకరు రూ. 3 కోట్లు నష్టపోయి గద్వాల విడిచి పారిపోగా... మరో ఉపాధ్యాయుడు రూ. 70 లక్షల అప్పుతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడితో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ. 5కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా కేంద్రంలో గతంలో ఓ విద్యార్థి బెట్టింగ్‌తో నష్టపోయి తీసుకున్న డబ్బులకు వడ్డీలు కట్టలేక దొంగగామారి జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఇలా అయిజ, గద్వాలలో జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేక నిఘా ఉంచాం

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమింగ్‌ల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. గద్వాల జిల్లా లో బెట్టింగ్‌లు నిర్వహించేవారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. బెట్టింగ్‌లను ప్రోత్సహించినా.. నిర్వహించినా చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాసరావు, ఎస్పీ, గద్వాల

Updated Date - Mar 26 , 2025 | 11:35 PM