Share News

భూ భారతి రైతులకు వరం

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:28 PM

భూ భారతి చట్టంతో రైతుకు ఎంతో మేలు జరుగుతుందని, ఇది ఓ వరం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

భూ భారతి రైతులకు వరం
సదస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యెన్నం, కలెక్టర్‌

- త్వరలోనే వీఆర్‌ఏ, వీఆవ్వో వ్యవస్థ

- అవగాహన సదస్సులో ఎమ్మెల్యే యెన్నం

హన్వాడ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : భూ భారతి చట్టంతో రైతుకు ఎంతో మేలు జరుగుతుందని, ఇది ఓ వరం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం హన్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్‌ విజయేందరి బోయితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి తెచ్చి కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతితో ఇక రైతులకు భూ సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. త్వరలోనే వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరిలో చట్టం చేసి మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అమలు చేసిందన్నారు. ఆధార్‌ లాగా పట్టా ఉన్న ప్రతీ రైతుకు భూదార్‌ కార్డులు అందనున్నట్లు తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మీ చెక్కులతో పాటు ఇబ్రాహీంబాద్‌ గ్రామానికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.50 వేల చెక్కులు అందించారు. పీడీ నర్సిములు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనిత, తహసీల్దార్‌ కిష్ట్యనాయక్‌, ఎంపీడీవో యశోదమ్మ, మండల అధ్యక్షుడు మహేందర్‌, సుధాకర్‌రెడ్డి, లింగంనాయక్‌, వెంకటయ్య, నవనీత, కలీం పాల్గొన్నారు

Updated Date - Apr 24 , 2025 | 11:28 PM