భూసమస్యల పరిష్కారానికే ‘భూభారతి’
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:18 PM
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూసమస్యల పరిష్కారానికే భూభారతి కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్
- దామరగిద్ద, ధన్వాడలలో అవగాహన సదస్సు
దామరగిద్ద/మరికల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూసమస్యల పరిష్కారానికే భూభారతి కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం దామరగిద్ద మండల కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొని, మాట్లాడారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించిందన్నారు. ప్రస్తుతం కొత్త చట్టం ద్వారా చిన్నచిన్న భూసమస్యలు తహసీల్దార్ స్థాయిలో పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. అక్కడ కాకుంటే ఆర్డీవో స్థాయిలో పరిష్కారానికి అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా పెద్ద సమస్యలు ఉంటే జేసీ, కలెక్టర్ ద్వారా పరిష్క రించుకునే అవకాశం ఉందన్నారు. ఐదేళ్లుగా ఒక్క సాదాబైనమా పరిష్కారం కాలేదని, కొత్త చట్టం ద్వారా సాదా బైనమాలు పరిష్కరించుకొనే అవకాశం ఉందన్నారు.
జూన్ 2 నుంచి ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు
భూసమస్యల పరిష్కారానికి జూన్ 2 నుంచి ప్రతీ రెవెన్యూ గ్రామంలో సదస్సు నిర్వహించి భూసమస్యలు పరిష్కరించి, రైతుల ఇబ్బందులు తీరుస్తామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అధికారులే రికార్డులతో గ్రామానికి వచ్చి సదస్సులో దరఖాస్తులు స్వీకరిస్తారని, చిన్న సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరిస్తారని వివరించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, తహసీల్దార్ జమీల్, ఎంపీడీవో సాయిలక్ష్మి, బాల్‌రెడ్డి, చిట్టెం మాధవరెడ్డి, రఘు, ఖాజామియా, ఆనంద్, వెంకటప్ప, లక్ష్మణ్, ఆయా గ్రామాల రైతులు పాల్గొ న్నారు.
అంతకుముందు ధన్వాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సింధూజ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భూభారతి అవగా హన సదస్సుకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో పాటు, కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై, మాట్లాడారు. ముందుగా భూభారతి చట్టం అమలు, అందులోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం ధరణి స్థానం లో తెచ్చిన, భూభారతి చట్టం రికార్డులో తప్పులు, సవరణలకు అవకాశం ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూసమస్యలు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుం టామన్నారు. సింగిల్ విండో అధ్యక్షుడు వెంకట్రా మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరహరి, మాధవరెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.