కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై చార్జిషీట్ కక్షపూరితం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:32 PM
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తమ పా ర్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్ దాఖలుచేయడం రాజకీయ కక్షపూరిత మని జడ్పీమాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ గ ద్వాల నియోజకవర్గం ఇన్‌చార్జి సరిత అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత
హెడ్ పోస్టాఫీస్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన
గద్వాల టౌన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తమ పా ర్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్ దాఖలుచేయడం రాజకీయ కక్షపూరిత మని జడ్పీమాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ గ ద్వాల నియోజకవర్గం ఇన్‌చార్జి సరిత అన్నారు. ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తు న్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరుస్తున్నట్లు ఆరోపించా రు. సోనియా, రాహుల్‌గాంధీపై కేసు నమో దును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కా ర్యకర్తలు బుధవారం పట్టణంలోని హెడ్ పోస్టా ఫీస్ ఎదుట నిరసనప్రదర్శన చేపట్టారు. ఈ సం దర్భంగా మాట్లాడిన సరిత, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను బీజేపీ నాయ కులు జీర్ణించుకోలేక పోవడం దౌర్భాగ్యమన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయకపోతే కాం గ్రెస్ పార్టీ ఆందోళనను మరింత తీవ్రతరం చే స్తుందన్నారు. మునిసిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీ ర్యం చేయడం ద్వారా పాలక బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుందన్నారు. టీపీసీ సీ కార్యవర్గ సభ్యుడు శంకర్ మాట్లాడుతూ ప్ర తిపక్షాలను రాజకీయంగా వేధించేందుకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉసిగొల్పడం రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు పాలకులు మూల్యం చె ల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమం లో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, డీఆర్ శ్రీధర్, శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్‌యాదవ్, పీఎన్ ఆర్ జగదీశ్, ఆనంద్‌గౌడ్, రంజిత్‌కుమార్, జయ కృష్ణ, బాలకృష్ణనాయుడు, బీఆర్ ఇమ్మానుయేల్, రాము, వెంకట్రాములు, ఆంజనేయులు, కృష్ణ మూర్తి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.తిరుమలేశ్ ఉన్నారు.