Share News

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:29 PM

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిర పేర్కొన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర

చిన్నచింతకుంట, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిర పేర్కొన్నారు. చైల్డ్‌ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఐకేపీ సమావేశ మందిరంలో మహిళా సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి ఆమె పాల్గొని, మాట్లాడారు. రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని, బాలల హక్కుల సంరక్షణ నిర్లక్ష్యం చేయరాదన్నారు. నేరాలఅదుపునకు చట్టాలతో పాటు బాధ్యతలు కూడా అంతే ముఖ్యం అన్నారు. బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాల వంటి అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే న్యాయ సేవాధికార సంస్థకు గాని, చైల్డ్‌లైన్‌ 1098కు ఫోన్‌చేసి వివరాలు చెబితే చర్యలు తీసుకుంటామని, అదే విధంగా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అంతకముందు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్‌ ఎల్లయ్య, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రాంలాల్‌నాయక్‌, ఏపీఎం విష్ణుచారి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మమ్మ, కేజీబీవీ ఎస్‌వో హేమలత, పారా లీగల్‌ వలంటీర్‌ యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:29 PM