Share News

వర్గపోరుతో నియోజకవర్గ అభివృద్ధికి విఘాతం

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:22 PM

అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో మొదలైన వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధికి విఘాతంగా మారిందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ అన్నారు.

వర్గపోరుతో నియోజకవర్గ అభివృద్ధికి విఘాతం

ఎన్‌హెచ్‌పీఎస్‌ జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో మొదలైన వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధికి విఘాతంగా మారిందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ అన్నారు. ఆధిపత్యం కోసం ఆరాట పడటం తప్ప అభివృద్ధి పట్ల నాయకులకు చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని పోరాట సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో రంజిత్‌కుమార్‌ మాట్లాడారు. భూభారతి అవగాహన కోసం ధరూర్‌లో ఏ ర్పాటు చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరైన సభలో కొత్తచ ట్టంపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించ డం కంటే నాయకుల రభసనే అధికం కావడం సిగ్గు చేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూ డా ఇదే నాయకుల మధ్య ఇదే విధమైన వర్గ పోరు కొనసాగి అభివృద్ధి నిలిచిందన్నారు. నిజం గా ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించాలంటే అన్ని చోట్ల ఒకే విధమైన పద్ధతి ఉండాలని, నాగర్‌క ర్నూల్‌లో ఒక రకంగా, గద్వాలలో ఇంకో రకం గా ఉండటమేమిటని ప్రశ్నించారు. లోక్‌సభ ఎ న్నికల సందర్భంగా మక్తల్‌ సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి గద్వాలలో బంగ్లా, బండ్ల రా జకీయాలకు చరమగీతం పాడతామని గొప్పలు చెప్పారని, ప్రస్తుతం జరుగుతున్న పరిమాణా లు ఏమిటో ప్రజలకు ఆయనే సమాధానం చె ప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా నాయ కులు తమ వ్యక్తిగత గుర్తింపు, ఆధిపత్యం కో సం ఆరాట పడటం మానుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేదంటే ప్రజల నుంచి ప్రతి ఘటన, తిస్కారం తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పోరాట సమితి కన్వీనర్‌ బుచ్చి బాబు, నాయకులు గౌని శ్రీనివాస్‌యాదవ్‌, నా గరాజు, విష్ణు, వీరేశ్‌, మల్దకల్‌, నాగేశ్‌, బీచుపల్లి ఉన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:22 PM