మహనీయులను అవమానించొద్దు
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:20 PM
జైబాపు జైభీమ్ జైసంవిధాన్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బుధ వారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం ఆధ్వర్యంలో పట్టణం లోని ఒకటవ వార్డు అవధూత మఠం నుంచి ర్యాలీ చేపట్టారు.
- జైబాపు జైభీమ్ జైసంవిధాన్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు
నారాయణపేట న్యూటౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జైబాపు జైభీమ్ జైసంవిధాన్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బుధ వారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం ఆధ్వర్యంలో పట్టణం లోని ఒకటవ వార్డు అవధూత మఠం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ మహానీయులైన మహాత్మాగాంధీ, అంబేడ్కర్ జీవిత చరిత్రలను వివరి స్తూ కరపత్రాలను అందజేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన బాపూజీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అసత్య ప్రచారాలతో బీజేపీ నాయకులు మా ట్లాడుతున్నారని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. అంతకుముందు బాపూజీ, అంబేడ్కర్ చిత్రపటాలను చేతిలో పట్టి సుభాష్‌చంద్ర బోస్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ అంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మనోహర్‌గౌడ్, వకీల్ సంతోష్, మహ్మద్‌నజీర్ తదితరులున్నారు.