Share News

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:17 PM

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

దళారులకు ధాన్యం విక్రయించొద్దు
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

చిన్నచింతకుంట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు కురుమూర్తి, అల్లీపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మాట్లాడారు. దేవరకద్ర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కథలప్ప, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు ప్రదీప్‌రెడ్డి, వజీర్‌బాబు, యువజన కాంగ్రెస్‌ నాయకులు వెంకటేష్‌, ప్రతాప్‌, శేఖర్‌, ఆత్మలింగం, చాకలి అశోక్‌, జీజీ పౌలు, గూడూరు శేఖర్‌, సాంసన్‌, తహసీల్దార్‌ ఎల్లప్ప, ఏవో రాజేష్‌ఖన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:17 PM