ఘనంగా ఈస్టర్ వేడుకలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:24 PM
ఈస్టర్ పండుగను ఆదివారం జడ్చర్లలో క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు.
జడ్చర్ల, ఏప్రిల్ 20 (ఆంధ్రజోతి) : ఈస్టర్ పండుగను ఆదివారం జడ్చర్లలో క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఏసుక్రీస్తు మరణం జయించి తిరిగి లేచిన రోజున ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. యునైటెడ్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ సమీపంలోని కల్వరికొండపై సామూహిక ఆరాధన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ రాజశేఖర్ ఈస్టర్ సందేశాన్నిచ్చారు. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి మూడో రోజు లేచాడని సర్వ మానవాళి కొరకై తాను చూపించిన ప్రేమ, విధేయత, నమ్మకత్వం మనందరికి చూపించారని వివరించారు. కల్వరికొండపై ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపన చేశారు. పాస్టర్ కె.విలియమ్‌బూత్, తిమోతి, జైపాల్, నిత్యానందం, లూథర్, మైఖేల్‌మనోహర్, దేవదానం, ఎబినేజర్, ప్రీతమ్, సందీప్, జాన్సన్, టైటస్, మోజెస్, ఆశీర్వాదం, నతానియేల్ పాల్గొన్నారు.
మిడ్జిల్ : మండలంలోని వెలుగొమ్ముల చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాస్టర్ ఏలియా సందేశం ఇచ్చారు. సంఘ సభ్యులు శంకర్, ఏలియా, లాజర్, శ్రీను, మాణిక్యమ్మ, జ్యోతి, సౌజన్య, మౌనిక, రాజు, ఆదాము, ప్రేమ్‌కుమార్, పద్మ, సారమ్మ, సామెల్, చిన్నయ్య, చెన్నయ్య, బాలమ్మ పాల్గొన్నారు.