డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:10 PM
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని, డ్రగ్స్ మత్తులో జీవితం నాశనం అవుతుందని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు.
- వాల్‌పోస్టర్ విడుదలలో ఎస్పీ యోగేష్‌గౌతమ్
నారాయణపేట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని, డ్రగ్స్ మత్తులో జీవితం నాశనం అవుతుందని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. గురువారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సం క్షేమశాఖ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్, డ్రగ్స్ వాడకాన్ని నిషేధిస్తూ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా అవగాహన పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించి, మాట్లాడారు. డ్రగ్స్ వల్ల సమాజంలో యువశక్తి విచ్ఛిన్నం అవుతుం దని, డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గి మంచి భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారి గురించి సమాచారం ఇవ్వాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తామన్నారు. నారాయణపేట జిల్లాలో డ్రగ్స్ లేకుండా నిర్మూలించడం మన అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో జయ, ఎఫ్‌ఆర్‌వో సాయి, వలంటీర్లు సంధ్య, లక్ష్మీకాంత్ ఉన్నారు.