Share News

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో శిథిలాల పరిశీలన

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:27 PM

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం ప్రమాద ఘటన జరిగి 57 రోజులు కాగా నాటి నుంచి నేటి వరకు రెస్క్యూ బృందాలు తవ్వకాలు జరుపుతూ వస్తున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో శిథిలాల పరిశీలన
సొరంగం లోపల పనులను పరిశీస్తున్న ప్రతేకాధికారి శివశంకర్‌ లోతేటి, సిబ్బంది

ప్రతేకాధికారి శివశంకర్‌ లోతేటి

తవ్వకాలలో వెలువడిన కొండరాళ్లు, టీబీఎం శకలాలు

లోకో ట్రైన్‌లో బయటకు తరలింపు

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్న ప్రత్యేకాధికారి

దోమలపెంట, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం ప్రమాద ఘటన జరిగి 57 రోజులు కాగా నాటి నుంచి నేటి వరకు రెస్క్యూ బృందాలు తవ్వకాలు జరుపుతూ వస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగించారు. ఇప్పటి వరకు సొరంగంలో జరిగిన పనులను పరిశీలించేందుకు ప్రత్యే కాధికారి శివశంకర్‌ లోతేటి శనివారం రెస్క్యూ బృందాలతో కలిసి సొరంగంలో జరిగిన పనులను పరిశీలించారు. ప్రమాద ప్రాంతంగా ఉన్న డీ1 వరకు వెళ్లి ఆ ప్రాంతంలో చేపట్టిన పనులు, తవ్వకాలలో వెలువడిన బండ రాళ్లను, టీబీఎం మిషన్‌ కళాశాలను త్వరితగతిన బయటకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కన్వేయర్‌ బెల్ట్‌, లోకో ట్రైన్‌ ద్వారా బయటకు తరిలించడంతో పాటు, నీటి ఊటను ఎప్పటి కప్పుడు పంపింగ్‌ చేయాలన్నారు. సొరంగంలో పని చేస్తున్న సహాయక సిబ్బందికి ఎటు వంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు రెస్క్యూ సిబ్బంది స్వ స్థలాలకు వెళ్లొద్దని ఆదేశించారు. సహాయక చర్యల్లో సింగరేణి రెస్క్యూ టీం మేనేజర్లు రా జేందర్‌రెడ్డి, మాధవరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, హై డ్రా, రైల్వే, జీఎస్‌ఐ, ఇరిగేషన్‌, జేపీ కంపెనీ, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ వివిధ శాఖల అధికారు లు పాల్గొన్నారు.

సొరంగంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటి వరకు కొనసాగిన సహాయక చర్యలు, ఇబ్బందులు, ఇక ముందు చేయాల్సిన పనులు, ప్రస్తుతం సొరంగంలో ఉన్న క్లిష్ట పరిస్థితులు, అవుసరమగు వసతులు తదితరి అంశాలపైన రెండు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను ప్రతేకాధికారి శివశంకర్‌ లోతేటి స మర్పించనున్నట్టు సమాచారం. ఆచూకీ దొరకని ఆరుగురి కార్మికుల కుంటుంబాలకు ప్రభుత్వం తరుపున ఇవ్వనున్న రూ. 25 లక్షల చెక్కులను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:27 PM