నకిలీ సీడ్ పత్తి విత్తనాల స్వాధీనం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:29 PM
జోగుళాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం కుర్తిరావులచెరువు శివారులోని పొలంలో నిల్వ చేసిన నకిలీ సీడ్‌పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నందీకర్ తెలిపారు.
మల్దకల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం కుర్తిరావులచెరువు శివారులోని పొలంలో నిల్వ చేసిన నకిలీ సీడ్‌పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నందీకర్ తెలిపారు. స్థానిక పోలీ స్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గ్రామ శివారులో, సబ్ ఆర ్గనైజర్ కురువ శ్రీను అలియాస్ రాజుకు చెందిన పొలంలో దాడులు నిర్వ హించినట్లు తెలిపారు. అక్కడి షెడ్ వద్ద 51 పాలిథిన్ బస్తాల్లో నిల్వ ఉంచిన 1,275 కిలోల నకిలీ సీడ్ పత్తి విత్తనాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసు కొని స్టేషన్‌కు తరలించామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నా మని చెప్పారు. మండలంలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు నిల్వ ఉంచినట్లు తెలి స్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. నకిలీ వి త్తనాలు అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అంతకుముందు మల్దకల్ ఎస్‌ఐ ఇచ్చిన సమాచారం మేరకు గద్వాల సీఐ టంగుటూరి శ్రీను గ్రామానికి చేరుకొని నకిలీ విత్తనాలను పరిశీలించారు. దాడిలో వ్యవసాయ అధికారి రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గో పాల్, కానిస్టేబుళ్లు నిరంజన్, నవీన్ ఉన్నారు.