Share News

రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:43 PM

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని

రైతులను ఆదుకోవాలి
మాదారంలో వరి పైరును పరిశీలిస్తున్న బీజేపీ కిసాన్‌ మోర్చా నాయకులు, అధికారులు

- అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించిన కిసాన్‌ మోర్చా కేంద్ర కమిటీ సభ్యుడు పాపన్న గౌడ్‌

ఊర్కొండ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని బీజేపీ కిసాన్‌ మోర్చా కేంద్ర కమిటీ సభ్యుడు పాపన్నగౌడ్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఎంబీ. బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం నాగర్‌కర్నూ ల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని మాదా రం, గుడిగానిపల్లి గ్రామాల్లో నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలను మండల వ్యవ సాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు బాధ లో ఉన్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరా నికి రూ.20 నష్ట పరిహారం చెలించాలని కోరారు. వారి వెంట కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌గౌడ్‌, కార్యవర్గ సభ్యుడు శ్యాంసుందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:43 PM