Share News

గన్నీ బ్యాగుల కోసం రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Apr 16 , 2025 | 10:53 PM

మక్తల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో గురువారం వివిధ గ్రామాల రైతులు గన్నీబ్యాగుల కోసం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

గన్నీ బ్యాగుల కోసం రైతుల రాస్తారోకో
అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న రైతులు

మక్తల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో గురువారం వివిధ గ్రామాల రైతులు గన్నీబ్యాగుల కోసం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్‌ మండలంలోని పంచదేవ్‌పహాడ్‌, పా రేవుల, చిట్యాల, కర్ని తదితర గ్రామాల రైతులు మాట్లాడుతూ వారంరోజుల నుంచి గన్నీ బ్యాగుల కోసం తిరిగినా అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సీఐ రాంలాల్‌ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

Updated Date - Apr 16 , 2025 | 10:53 PM