Share News

కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

ABN , Publish Date - Apr 16 , 2025 | 10:55 PM

మునిసిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలమడుగు సుధాకర్‌ విమర్శించారు.

కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
మాట్లాడుతున్న పాలమడుగు సుధాకర్‌

- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలమడుగు సుధాకర్‌

నారాయణపేట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలమడుగు సుధాకర్‌ విమర్శించారు. బుధవారం నారాయణపేట అం బేడ్కర్‌ భవన్‌లో జరిగిన జిల్లా సదస్సునుద్ధేశించి ఆయన ప్రసంగించారు. తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మునిసిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో ప్రభు త్వాలకు మనసు రావడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డి మాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలన్నారు. కార్మికులకు మల్టీపర్సస్‌ విధానాన్ని రద్దు చేసి కారోబార్‌, బిల్‌ కలెక్టర్‌లకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల హోదా ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ కార్మికులకు పర్మినెంట్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, చంద్రప్ప, అశోక్‌, హన్మంతు, బాలయ్య, సాయిలు, యర్రన్న, కాశమ్మ, నీలమ్మ తదితరులున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 10:55 PM