ఇంటర్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:22 PM
మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు.
- ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు
- దామరగిద్ద కాలేజీలో సెకండియర్‌లో 73.21 శాతం ఉత్తీర్ణతతో ముందంజ
- కోస్గి కాలేజీలో 46.82 శాతం ఉత్తీర్ణతతో వెనుకంజ
- ఫస్టియర్ ఫలితాల్లో ఊట్కూర్‌లో 59.65 శాతంతో ఆధిక్యం
- మక్తల్ కాలేజీలో 27.22 శాతంతో అత్యల్పం
నారాయణపేట, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. అయితే పేట జిల్లా వ్యాప్తంగా ఎనిమి ది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఏ ఒక్క జూనియర్ కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత రాలేదు. జిల్లాలో అత్యధికంగా సెకండియర్‌లో దామరగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 112 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 82 మంది ఉత్తీర్ణులై 73.21 శాతంతో అధిక్యంలో నిలిచారు. కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 260 మంది జనరల్ ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 111 మంది పాస్ కాగా 42.69 శాతం, వొకేషనల్‌లో 39 మందికి గాను 29 మంది పాసై 74.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 299 మందికి గాను 140 మంది ఉత్తీర్ణులై 46.82 శాతానికే పరిమితమై అత్యల్పంగా నిలిచారు. మద్దూర్ కాలేజీలో 137 మందికి 95 మంది పాస్‌కాగా 69.43 శాతం, మాగనూర్ కాలేజీలో 96 మందికి 65 మంది పాస్ కాగా 67.71 శాతం, ఊట్కూర్ కాలేజీలో 84 మందికి 55 మంది పాస్‌తో 65.48 శాతం, నారాయణపేట కాలేజీలో 256 మందికి గాను 139 మంది పాస్‌తో 54.3 శాతం, ధన్వాడ కాలేజీలో 135కు 67 మంది 49.63 శాతం, మక్తల్ కాలేజీలో 233 మందికి 114 మంది పాస్‌తో 48.93 శాతం సెకండీయర్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 57 మందికి 34 మంది పాస్‌తో 59.65 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో ఆధిక్యంలో నిలిచారు. అత్యల్పంగా మక్తల్ కాలేజీలో 180 మందికి 49 మంది ఉత్తీర్ణులై 27.22 శాతంతో ఫస్టియర్ ఫలితాల్లో నిలిచారు. దామరగిద్ద కాలేజీలో 90 మందికి 48 మంది పాస్‌తో 53.33 మంది, మద్దూర్ కాలేజీలో 117కు గాను 62 మంది పాస్‌తో 52.99 శాతం, మాగనూర్ కా లేజీలో 112కు గాను 52 మంది పాస్‌తో 46.43 శాతం, నారాయణపేట కాలేజీలో 267కు 113 మంది పాస్‌తో 42.32 శాతం, ధన్వాడ కాలేజీలో 136కు 56 మంది పాస్‌తో 41.18 శాతం, కోస్గి కాలేజీలో 260కి 106 మంది పాస్‌తో 40.77 శాతం ఫస్టియర్‌లో ఉతీర్ణత సాధించారు.
ఊట్కూర్ కస్తూర్భాలో వంద శాతం ఉత్తీర్ణత
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో పేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఊట్కూర్ కేజీబీవీలో విద్యార్థినులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక్క డున్న 66 మంది విద్యార్థినులందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 29 మంది 90 శాతం మార్కులు సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లోనూ ఊ ట్కూర్ కేజీబీవీలో ఉన్న 69 మంది వందశాతం ఉత్తీర్ణతతో జిల్లాలోనే ఆధిక్యంలో ఉన్నారు. నారాయణపేట కేజీబీవీలో 44 మందికి 39 మంది పాసై 89 శాతం ఉత్తీర్ణత, మక్తల్‌లో 44కు 30 మంది పాస్‌తో 68 శాతం, నారాయణపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎంపీసీ సెకండి యర్‌లో 35కు 31 మంది ఉత్తీర్ణులై 89 శాతం ఉత్తీర్ణత సాధించగా, బైపీసీలో 27కు 25 మంది ఉత్తీర్ణతతో 93 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అలాగే, నర్వ మండల కేజీబీవీ ఇంటర్ ఫస్టి యర్ విద్యార్థినులు భారతమ్మ 493, శ్వేత 490, పూజ(సీఈసీ) 468, శిరీష(సీఈసీ) 466, సెకం డియర్‌లో శ్రీజ 970, అశ్విని (సీఈసీ) 962, అక్షయ(సీఈసీ) 947 మార్కులు సాధించారు. కాగా, అశ్విని 962 మార్కులతో సీఈసీ విభాగం లో స్టేట్ మొదటి ర్యాంకు సాధించింది.
దామరగిద్ద కేజీబీవీ విద్యార్థినులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 72 మందికి గాను 58 మంది బాలికలు పాసై 94 శాతం ఉత్తీర్ణత సా ధించారు. రెండో సంవత్సరంలో 69 మంది బాలి కలకు గాను 67 మంది పాసై 97 శాతం ఉత్తీ ర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో దామరగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 112 మందికి 82 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దామరగిద్దకు చెందిన పూజ ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విభాగంలో 965 ఏ-గ్రేడ్ మార్కులతో జిల్లా ర్యాంక్ సాధించిందని కళాశాల అధ్యాపకుడు రామచంద్రారెడ్డి తెలిపారు. మొదటి సంవత్సరంలో 90 మందికి 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సా ధించినట్లు ఆయన వివరించారు.